Site icon NTV Telugu

ఫ్లోటింగ్ రెస్టారెంట్.. గోదావరిలో విహరిస్తూ తినొచ్చు

గలగల గోదావరి.. ఆ చల్లని గోదారమ్మ ఒడిలో సేదతీరుతూ మనకిష్టమయిన ఆహారం తింటే భలేగా వుంటుంది కదూ. ఈ ఆలోచన పర్యాటక శాఖ వారికి వచ్చింది. రాజమండ్రి వద్ద గోదావరి నదిలో ఏపీ టూరిజం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటుచేసింది.

70 లక్షల రూపాయలతో ఫ్లోటింగ్ రెస్టారెంట్ ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు. ఈ రెస్టారెంట్ ను మంత్రి అవంతి శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్లోటింగ్ రెస్టారెంట్ 15 రోజుల్లో అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

అంతర్వేది నుంచి భద్రాచలం వరకు టూరిజం అభివృద్ది చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 13 జిల్లాల్లో సెవన్ స్టార్ రెస్టారెంట్లు ఏర్పాటుకు కృషి చేస్తున్నామని అన్నారు. టూరిజం ప్రాముఖ్యత కలిగిన రాజమండ్రిని హెరిటేజ్ సిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తానని మంత్రి అవంతి హామీ ఇచ్చారు. అభివృద్దిపై ప్రతిపక్షాల విమర్శలు సహేతుకంగా ఉండాలని హితవు పలికారు. టీడీపీ విమర్శలు సహేతుకంగా లేవని విమర్శించారు చంద్రబాబు అభివృద్ధికి అడ్డం పడుతున్నారని విమర్శించారు.

Exit mobile version