Site icon NTV Telugu

బీజేపీ తీరుపై స్పీకర్ తమ్మినేని ఆగ్రహం

ఏపీలో బీజేపీ తీరుపై స్పీకర్ తమ్మినేని సీతారాం మండిపడ్డారు. ప్రజాగ్రహా సభలో విశాఖ స్టీల్ ప్లాంట్ గూర్చి చెప్పాలన్నారు. విద్యార్ది నాయకుడిగా పనిచేసిన నా గుండె రగిలిపోతుంది. ఎందరో సమర యోధులు స్టీల్ ప్లాంట్ కోసం అమరులైయ్యారు. మహానీయుల త్యాగాలు ప్రయివేటైజ్ చేయటానికా సభ. ప్రత్యక్ష ఉద్యమంలో నాడు విద్యార్ది నాయకుడిగా పాల్గొన్నాను. ఖచ్చితంగా రాష్ర్టానికి జరిగిన అన్యాయంపై మాట్లాడాలి.

రాష్ర్ట నాయకులంతా మోదీతో , నిర్మలా సీతారామన్ తో మాట్లాడాలి. రాజకీయపార్టీలకు ఎజెండా ప్రాధాన్యతలు ఉంటాయి. సభలు పెట్టుకోవడంలో తప్పులేదు.అదేసమయంలో స్టీల్ ప్లాంట్ ఉద్యమనేతగా అడుగుతున్నా చెప్పండి. నాడు జైళ్ళలో పెట్టారు. ప్రజాగ్రహా సభలో రైల్వే జోన్ , ప్రత్యేక హోదా , వెనుకబడిన‌ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడాలన్నారు తమ్మినేని సీతారాం.

ఏవ్యక్తి , పార్టీలను , వ్యవస్దలను కించపరచాలనే ఉద్యేశం కాదు. ప్రధానమైన‌ సమష్యలు వదిలి ప్రజల్ని తప్పు దోవ పట్టించొద్దు. ఏకారణాలతో చేయలేక పోయారో బీజేపీ నేతలు ఏపీ ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలే ఎన్నికలలో అంతిమ తీర్పు ఇస్తారన్నారు సీతారాం.

Exit mobile version