NTV Telugu Site icon

AP Budget 2023-2024: నేడే ఏపీ బడ్జెట్.. బుగ్గన పద్దు ఎంతంటే..

Ap Budget

Ap Budget

ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఈ రోజు అసెంబ్లీ లో 2023-24 బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. శాసనమండలి లో ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాష ఆర్ధిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. మండలిలో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఈసారి మాత్రం సుమారు రెండు ల‌క్షల 65 వేల నుంచి 70 వేల కోట్ల మధ్య బ‌డ్జెట్ అంచ‌నాలు రూపొందించిన‌ట్లు సమాచారం. ఇవాళ ఉదయం ఏపీ క్యాబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన జరుగనున్న సమావేశంలో బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. అసెంబ్లీ లో ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ ను మంత్రిమండలి ఆమోదించనుంది.
Also Read:Nani: దసరాను కెజిఎఫ్ తో పోల్చినవారికి దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన నాని

వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పూర్తి స్థాయి బడ్జెట్ ఇదే. వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో తాజా బడ్జెట్ లో భారీగా కేటాయింపులు ఉంటాయని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లల్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటోంది ఏపీ సర్కార్. వివిధ శాఖలకు కేటాయింపులు ఏ విధంగా ఉంటాయోననే అంశంపై ఆసక్తి నెలకొంది. ఉద‌యం 11 గంట‌లకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ అసెంబ్లీలో బడ్జెట్టు ప్రవేశ‌ పెట్టనున్నారు. ఈసారి కూడా ఎప్పటిలాగే వ్యవ‌సాయానికి ప్రత్యేక బ‌డ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు. సాధారణ బడ్జెట్టును మంత్రి బుగ్గన ప్రవేశపెట్టాక.. ఆ తర్వాత వ్యవసాయ బడ్జెట్టును మంత్రి కాకాని ప్రజెంట్ చేయనున్నారు. వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లుండ‌టంతో ఇదే చివ‌రి పూర్తి స్థాయి బ‌డ్జెట్ అవుతుంది. అంతేకాదు ఎన్నిక‌ల బడ్జెట్ కావ‌డంతో గతం కంటే ఎక్కువ‌ కేటాయింపుల‌తో బ‌డ్జెట్ రూపకల్పన చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈసారి కూడా న‌వ‌ర‌త్నాలు, సంక్షేమ ప‌థ‌కాల‌కు కేటాయింపులు ఎక్కువ‌గా ఉంటాయ‌నితెలుస్తోంది. గతేడాది గ్రామీణాభివృద్దితో పాటు విద్య, వైద్యం, సంక్షేమం, సాగునీటి రంగాల‌కు అధిక కేటాయింపులు చేసింది. వ్యవసాయ బ‌డ్జెట్టును 13వేల 630 కోట్ల రూపాయలతో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.