Site icon NTV Telugu

ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన ఏపీ గవర్నర్

ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌ నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రి నుంచి మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ హరిచందన్ డిశ్చార్జ్ అయ్యారు. కొన్ని రోజుల కిందట జలుబు, దగ్గు వంటి లక్షణాలతో గవర్నర్ హరిచందన్ బాధపడుతుండటంతో అధికారులు కరోనా పరీక్షలు నిర్వహించగా… కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.

Read Also: బిగ్ బ్రేకింగ్…. ఏపీ శాసనమండలి రద్దును వెనక్కి తీసుకున్న సర్కార్

మరోవైపు గవర్నర్ సతీమణికి కూడా కరోనా ఉందని తేలడంతో గవర్నర్ దంపతులను విజయవాడ రాజ్‌భవన్ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. మంగళవారం నాడు నిర్వహించిన పరీక్షల్లో కరోనా నెగిటివ్ రావడంతో వైద్యులు గవర్నర్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకోగా… గవర్నర్ ప్రత్యేక కార్యదర్శి ఘనస్వాగతం పలికారు. రాష్ట్ర ప్రజల ఆశీస్సులు, వైద్యుల సేవలతోనే తాను మళ్లీ కోలుకున్నానని గవర్నర్ తెలిపారు. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకోవడంతో తనకు ఇబ్బందులు ఎదురుకాలేదని వివరించారు.

Exit mobile version