Site icon NTV Telugu

న్యూఇయర్ ట్రీట్.. ఏపీలో మద్యం ప్రియులకు గుడ్‌న్యూస్

కొత్త సంవత్సరం సందర్భంగా ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులను డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్ షాపులను అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Read Also: ఏపీలో మరో కంపెనీ భారీ పెట్టుబడులు.. 36వేల మందికి పైగా ఉపాధి

మరోవైపు ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరుగా పెరుగుతున్న వేళ న్యూఇయర్ వేడుకలపై దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం మద్యం షాపులకు అర్ధరాత్రి వరకు పర్మిషన్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే డిసెంబర్ 31న అర్ధరాత్రి మద్యం అమ్మకాలతో అధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉండటంతో ఏపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version