NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌: కొత్తగా ఎన్నం టే…

ఏపీలో క‌రోనా ఉధృతి ఏమాత్రం త‌గ్గ‌డంలేదు.  తాజాగా ఏపీలో 24 గంట‌ల్లో 1557 కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,12,123కి చేరింది.  ఇందులో 19,83,119 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,179 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో క‌రోనాతో 18 మంది మృతిచెందిన‌ట్టు ఆరోగ్య‌శాఖ బులిటెన్‌లో పేర్కొన్న‌ది.  దీంతో ఏపీలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 13,825కి చేరింది.  ఇక‌పోతే, గ‌డిచిన 24 గంట‌ల్లో ఏపీలో 1213 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  చిత్తూరులో 255, తూర్పు గోదావ‌రిలో 232, కృష్ణాజిల్లాలో 159, నెల్లూరులో 164, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో 212 కేసులు న‌మోద‌య్యాయి.  

Read: వైర‌ల్‌: పెళ్లిపీట‌ల‌పైనే వరుడి చెంప ప‌గ‌ల‌గొట్టిన వధువు… ఎందుకంటే…