NTV Telugu Site icon

ఏపీ క‌రోనా అప్డేట్‌: ఈరోజు కేసులు ఎన్నంటే…

ఏపీలో క‌రోనా ఉధృతి కొన‌సాగుతున్న‌ది.  ప్ర‌తిరోజూ వెయ్యికి పైగా కేసులు న‌మోద‌వుతున్నాయి.  తాజాగా రాష్ట్రంలో 1145 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 20,28,795కి చేరింది.  ఇందులో 19,99,651 మంది ఇప్ప‌టికే కోలుకొని డిశ్చార్జ్ కాగా.. 15,157 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.  ఇక గ‌డిచిన 24 గంట‌ల్లో క‌రోనా నుంచి 1090 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.  24 గంట‌ల్లో క‌రోనాతో 17 మంది మృతి చెందిన‌ట్లు హెల్త్ బులిటెన్‌లో పేర్కొన్నారు.  దీంతో రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో మృతి చెందిన వారి సంఖ్య 13,987కి చేరింది.  చిత్తూరులో 132, తూర్పుగోదావ‌రిలో 216, క‌డ‌ప‌లో 111, కృష్ణాలో 128, నెల్లూరులో 173, ప్ర‌కాశంలో 117 కేసులు న‌మోద‌య్యాయి.  

Read: ఉత్త‌ర భార‌తంలో పెరిగిన ఎన్నిక‌ల వేడి…