ఉత్త‌ర భార‌తంలో పెరిగిన ఎన్నిక‌ల వేడి…

ఉత్త‌ర భార‌త‌దేశంలో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.  వ‌చ్చేనెల‌లో వివిధ రాష్ట్రాల్లో ఉప ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ముఖ్యంగా ప‌శ్చిమ బెంగాల్‌లో జ‌ర‌గ‌బోతున్న ఉప ఎన్నిక ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తి క‌లిగిస్తోంది.  భవానీపూర్ నుంచి మ‌మ‌తా బెన‌ర్జీ పోటీ చేస్తున్నారు.  ఈ ఉప ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీపై ప్రియాంక‌ను రంగంలోకి దించుతోంది బీజేపీ.  లాయ‌ర్‌గా ఆమెకు కోల్‌క‌తాలో మంచిపేరు ఉన్న‌ది.  డేరింగ్ విమెన్‌గా ఆమెకు అక్క‌డ పేరు ఉన్న‌ది.  2021 ఎన్నిక‌ల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఓట‌మిపాల‌య్యారు.  ఇప్పుడు మ‌మ‌తా బెన‌ర్జీపై పోటీ చేసే అవ‌కాశం రావ‌డంతో ప్ర‌చారం మొద‌లుపెట్టారు.  ఈ ఎన్నిక‌ల త‌రువాత దేశంలోని ఐదు రాష్ట్రాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉన్న‌ది.  ఈ ఎన్నిక‌ల కోసం జాతీయ పార్టీలైన బీజేసీ, కాంగ్రెస్‌లు క‌స‌రత్తులు మొద‌లుపెట్టాయి.  ఇప్ప‌టికే ఉత్త‌ర‌ప్రదేశ్‌లో ఎన్నిక‌ల వేడి మొద‌లైంది.  యోగి నేతృత్వంలోనే మ‌రోసారి బీజేపి ఎన్నిక‌ల‌కు వెళ్ల‌బోతున్న‌ది.  యోగి స‌ర్కార్‌పై అక్క‌డి ప్ర‌జ‌ల నుంచి పెద్ద‌గా విమ‌ర్శ‌లు లేక‌పోవ‌డంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణ‌యం తీసుకున్నది.  ఇక‌, గుజ‌రాత్‌కు వ‌చ్చే ఏడాది ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి.  ఈ ఎన్నిక‌ల‌కు ముందే అక్క‌డ ముఖ్య‌మంత్రిని మారుస్తున్నారు.  గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్ రూపానీ కొద్ది సేప‌టి క్రిత‌మే రాజీనామా చేశారు.  కొత్త‌వారికి అవ‌కాశం ఇచ్చేందుకు రాజీనామా చేసిన‌ట్టు తెలిపారు.  ఈ రెండురాష్ట్రాలు బీజేపీ చాలా కీల‌కం.  గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోడీ ఉన్న‌ప్ప‌టినుంచి అక్క‌డ బీజేపీ ప‌ట్టుకోల్పోకుండా అధికారంలో ఉంటూ వ‌స్తున్న‌ది. మోడీ ప్ర‌ధాని అయ్యాక ఆనంది బెన్ ప‌టేల్ ముఖ్య‌మంత్రి అయ్యారు.  ఆ త‌రువాత 2016లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో బీజేపి విజ‌య‌కేత‌నం ఎగ‌ర‌వేసింది.  కాగా, ప్ర‌స్తుతం దేశ‌వ్యాప్తంగా బీజేపీకి కొంత ఎదురుగాలి వీస్తుండ‌టంతో ఈసారి జ‌రిగే ఎన్నికల్లో బీజేపి ఏ మేర‌కు విజ‌యం సాధిస్తుందో చూడాలి.  

Read: బీజేపీ నేత కీల‌క వ్యాఖ్య‌లు: అక్క‌డ కూడా మ‌మ‌త‌ను ఓడిస్తాం…

Related Articles

Latest Articles

-Advertisement-