NTV Telugu Site icon

అక్కడి నుంచి రాయలసీమకు ఆక్సిజన్ అందించండి… 

రాయలసీమలో కరోనా ఉధృతి కొనసాగుతోంది.  ఇటీవలే తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది రోగులు మృతి చెందిన విషయం తెలిసిందే.  కర్ణాటక, తమిళనాడు ఆక్సిజన్ ప్లాంట్స్ నుంచి రాయలసీమకు ఆక్సిజన్ సరఫరా అవుతుంది.  ప్రస్తుతం రాష్ట్రానికి 910 మెట్రిక్ టన్నుల మెడికల్ ఆక్సిజన్ అవసరం అవుతున్నది.  అయితే, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి రావాల్సిన ఆక్సిజన్ సమయానికి అందటం లేదని, ఫలితంగా రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, గుజరాత్ లోని జామ్ నగర్ లో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి 80 టన్నుల ఆక్సిజన్ అందించాలని కోరుతూ ప్రధాని మోడీకి ఏపీ సీఎం వైఎస్ జగన్ లేఖ రాశారు.  ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి.  కేసులతో పాటుగా మరణాల సంఖ్య కూడా పెరుగుతున్నది.  ప్రస్తుతం రాష్ట్రంలో ఉదయం, రాత్రి కర్ఫ్యూ అమలు జరుగుతున్నది.  ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కర్ఫ్యూ సడలింపులు ఉన్నాయి.