NTV Telugu Site icon

AP Budget Session: రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు… గవర్నర్ ప్రసంగంపై చర్చ

Ap Budget

Ap Budget

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. నిన్న గవర్నర్ జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గవర్నర్ ప్రసంగానికి ఇవాళ ధన్యవాద తీర్మానం ప్రవేశపెట్టి దానిపై చర్చిస్తున్నారు. రేపు ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెడతారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వీర్యంపై టీడీపీ వాయిదా తీర్మానం ఇవ్వాలని భావిస్తోంది. ప్రభుత్వాన్ని ఆయా అంశాలపై నిలదీయాలని టీడీపీ నిర్ణయించింది. దాదాపు 15 సమస్యలపై చర్చకు పట్టుబట్టాలని టీడీపీ భావిస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 24 వరకు సమావేశాలు కొనసాగుతాయి. ఈ మేరకు బిఏసీలో నిర్ణయం తీసుకున్నారు. బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అసెంబ్లీ వద్ద భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగించనున్నారు.

కాగా,ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. మార్చి 24 వరకు తొమ్మిది రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Show comments