NTV Telugu Site icon

‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ పాటకు ఏపీ బీజేపీ నేతల డ్యాన్సులు

విజయవాడ సిటీ బీజేపీ కార్యాలయంలో జరిగిన నూతన సంవత్సర వేడుకలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు ఆడ, మగ తేడా లేకుండా ‘ఆరేసుకోబోయి పారేసుకున్నాను’ సినిమా పాటకు చిందులేశారు. వారి వెనుక వైపు ప్రధాని మోదీ, జేపీ న‌డ్డా, సోము వీర్రాజులతో కూడిన ఫ్లెక్సీ ఉండ‌గా.. ఆ వేదిక పైనే బీజేపీ నేత‌లు డ్యాన్సులు వేశారు.

Read Also: దేశంలోనే బెస్ట్ డీజీపీగా ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్

అయితే ఇటీవలే తాము అధికారంలోకి వస్తే రాష్ట్ర రెవెన్యూను ఉపయోగించుకుని రూ. 50కే చీప్ లిక్కర్ అందిస్తామంటూ ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోమువీర్రాజు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. తాజాగా పార్టీ ఆఫీసులో డ్యాన్సులు వేయడంపై అధిష్టానానికి కొందరు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఒకపక్క భార‌తీయ‌త‌, విలువ‌లు, జాతీయ వాదం, హిందుత్వం.. అంటూ నీతులు చెప్తూ.. మరోవైపు పార్టీ కార్యాలయంలో బీజేపీ నేతలు చిల్లర డ్యాన్సులు వేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.