Site icon NTV Telugu

రేపే బద్వేల్‌ ఉప ఎన్నికల ఫలితం.. కమలనాథుల లెక్క ఇది..!

కడప జిల్లా బద్వేల్‌ ఉప ఎన్నికల పోలింగ్‌ ముగిసింది.. మరికొన్ని గంటల్లో ఫలితం కూడా వెలువడనుంది.. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు దూరంగా ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం అభ్యర్థులను పోటీకి పెట్టాయి.. ఇక, బీజేపీ అభ్యర్థిని టీడీపీ, జనసేన సహకరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఏకంగా కొన్ని పోలింగ్‌ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలను కూర్చున్నారంటూ సోషల్‌ మీడియాలో ఫొటోలు హల్‌చల్‌ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమ రిస్థితి ఏంటి అనేది దానిపై కమలనాథులు లెక్కలు వేసుకుంటున్నారు.

Read Also: నా చ‌ర్మంతో చెప్పులు కుట్టించినా సీఎం జగన్‌ రుణం తీర్చుకోలేను..!

బద్వేల్‌లో గతానికంటే మెరుగైన ఓట్లు.. ఓట్ల శాతం తమకు పెరుగుతాయని బీజేపీ శ్రేణులు అంచనా వేసుకుంటున్నాయి.. 28 పోలింగ్‌ స్టేషన్లలో రిగ్గింగ్ జరిగిందని ఆరోపిస్తున్న బీజేపీ.. లేకుంటే మరిన్ని ఓట్లు పెరిగేవి అని అంచనాలు కడుతున్నారు. ఇక, తెలుగుదేశం పోటీలో లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకే పడిందని బీజేపీ లెక్కలు వేసుకుంటుంది.. సీఎం రమేష్, ఆదినారాయణ రెడ్డి వంటి నేతలు టీడీపీ కేడర్‌కు టచ్ లోకి వెళ్లడంతో తమకు ఓట్లు పడ్డాయని భావిస్తోంది ఏపీ కమల దళం.. మరి కమలనాథుల అంచనాలు ఏ స్థాయిలో నిజం అవుతాయనేది మాత్రం మంగళవారం మధ్యాహ్నం లోపు తేలిపోనుంది. అయితే, వైసీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మృతితో వచ్చిన ఈ ఎన్నికల్లో.. ఆయన భార్యే పోటీ చేయడంతో.. వైసీపీ అభ్యర్థి విజయం నల్లేరు మీద నడకే అంటున్నారు.

Exit mobile version