Site icon NTV Telugu

రణరంగంగా మారిన ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండవ రోజు సభలో అధికార, విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. మొదటి సభలోకి చంద్రబాబు రాకపోవడంతో కుప్పం ఫలితాల కారణంగా రాలేదని జగన్‌ వ్యాఖ్యానించారు. దీంతో టీడీపీ నేతలు చంద్రబాబును సభలోకి ఆహ్వానించారు. అయితే వైసీపీ మంత్రి కొడాలి నాని సభలో మాట్లాడుతూ.. రైతుల సమస్యలపై చర్చించడానికి టీడీపీ ధైర్యం లేదని.. వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

అంతేకాకుండా ఇక్కడ రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నామని వేరే సమస్యలు గురించి మాట్లాడాలనుకుంటే దానికి కూడా రెడీ అంటూ సవాల్‌ విసిరారు. దీనిపై చంద్రబాబు స్పందిస్తూ.. సభ మర్యాద పాటించడంలేదని వైసీపీ మంత్రులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనితోపాటు బాబాయి గొడ్డలి పెట్టు నుంచి అమ్మకు వెన్నుపోటు వరకు అన్ని మాట్లాడుకుందాం అంటూ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో సభంతా ఒక్కసారిగా వేడెక్కింది. వైసీపీ, టీడీపీ నేతలను స్పీకర్‌ తమ్మినేని సీతారం శాంతింపజేశారు.

Exit mobile version