NTV Telugu Site icon

లాక్‌డౌన్‌లో స్ట్రెస్‌గా ఫీల‌వుతున్నారా… యాప్ లో ఇలా చేయండి…

లాక్‌డౌన్‌లో ఇంట్లోనే  ఉండ‌టం వ‌ల‌న ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నారో చెప్ప‌క్క‌ర్లేదు.  ఇంట్లోనే ఉండ‌టం వ‌ల‌న మెంట‌ల్‌గా స్ట్రెస్ కు గుర‌వుతుంటారు.  స్ట్రెస్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌టానికి అనేక మార్గాల‌ను అన్వేషిస్తుంటారు.  అలాంటి వాటిల్లో ఈ యాప్ కూడా ఒక‌టి.  అదే యాంటీ స్ట్రెస్ యాప్‌.  ఈ యాప్‌లో అనేక గేమ్స్ ఉన్నాయి.  అన్నీకూడా స్ట్రెస్ ను త‌గ్గించే గేమ్స్ కావ‌డం విషేషం.  ఈ యాప్ లో ఉండే గేమ్స్ ను చూస్తే… చిన్న‌ప్ప‌టి ఆట‌లు గుర్తుకు వ‌స్తాయి అన‌డంలో సందేహం అవ‌స‌రం లేదు.  కొన్ని గేమ్స్ ఉచింతంగా ఆడుకునే విధంగా ఉంటే, మ‌రికొన్ని మాత్రం పే చేసుకొని ఆడుకోవాలి. ఇందులో రూపోందించిన యాంటిస్ట్రెస్ గేమ్స్ తో త‌ప్ప‌నిస‌రిగా స్ట్రెస్ త‌గ్గుతుందని అంటున్నారు రూప‌క‌ర్త‌లు.