NTV Telugu Site icon

రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్

తెలంగాణలో ఒమిక్రాన్ కరోనా వేరియంట్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మరో ముగ్గురికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని అధికారులు వెల్లడించారు. ఇటీవల దుబాయ్ నుంచి ముస్తాబాద్ మండలానికి వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. అయితే అతడి భార్య, తల్లితో పాటు స్నేహితుడికి కూడా ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు టెస్టులు నిర్వహించగా పాజిటివ్‌ అని తేలింది.

Read Also: తీన్మార్ మల్లన్నపై ఎమ్మెల్యే షకీల్ సంచలన వ్యాఖ్యలు

తాజాగా నమోదైన మూడు కేసులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 4కి చేరింది. ఒమిక్రాన్ నిర్ధారణ అయిన బాధితులను అధికారులు హైదరాబాద్‌లోని టిమ్స్ ఆస్పత్రికి తరలించారు. మరోవైపు జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరిస్తూ శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు. కాగా తెలంగాణలో ఇప్పటివరకు నమోదైన ఒమిక్రాన్ కేసుల సంఖ్య 44కి పెరిగింది.