Site icon NTV Telugu

బ్రేకింగ్‌ : భారత్‌లో మరో ఒమిక్రాన్‌ కేసు..

ఇప్పుడిప్పుడే కరోనా డెల్టా వేరియంట్‌ నుంచి బయటపడుతున్న తరుణంలో మరొ కొత్త వేరియంట్‌ వెలుగులోకి వచ్చి ప్రపంచ దేశాలను సైతం మరోసారి భయాందోళనకు గురిచేస్తోంది. దక్షిణాఫ్రికాలో బయటపడ్డ కరోనా కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’ ఇప్పుడు భారతదేశంలో కూడా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల కర్ణాటకలో 2 ఒమిక్రాన్‌ కేసులు వెలుగు చూసిన విషయం తెలిసింది. తాజాగా మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది.

దక్షిణాఫ్రికా నుంచి గుజరాత్‌కు వచ్చిన ఓ వ్యక్తికి కరోనా పరీక్షలు నిర్వహించగా అతడికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణైంది. ఈ నేపథ్యంలో అతడి శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా ఒమిక్రాన్‌ వేరియంట్‌గా వెల్లడైంది. దీంతో ప్రస్తుతం ఒమిక్రాన్‌ సోకిన వ్యక్తి కాంటాక్టులకు కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొత్తగా నమోదైన ఒమిక్రాన్‌ కేసుతో ప్రస్తుతం భారత్‌లో 3కు ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య చేరుకుంది.

Exit mobile version