బిగ్‌బాస్ 5 హౌస్ నుంచి అనీ బయటకు వచ్చేసిన సంగతి తెలిసిందే. మొత్తం హౌస్‌లో 77 రోజులపాటు గడిపినట్టు అనీ తెలియజేసింది. ఇచ్చిన టాస్క్ ప్రకారం తాను 70 రోజులపాటు హౌస్‌లో అందరికీ వంటచేసి పెట్టానని, చివర్లో వంటపై చిరాకు వచ్చిందని, అందుకే బాత్‌రూమ్ క్లీనింగ్ సెక్షన్ తీసుకున్నట్టు అనీ మాస్టర్ తెలిపారు. విమెన్ అంటే పేషెన్సీ అని చెప్పి హౌస్‌లోకి వెళ్లిన తనకు రెండో వారంలోనే ఆ పేషేన్సీ కొంతమేర దెబ్బతిందని అనీ మాస్టర్ తెలిపింది. హౌస్‌లో గేమ్ సమయంతో చిన్న పిల్లోలను తన షర్ట్ లోపల దాచుకున్నానని వాటిని కనిపెట్టేందుకు వచ్చిన హౌస్‌మేట్స్ చేతులు లోపలికి పెట్టి పిల్లోలను తీశారని, ఆ సమయంలో తానకు చాలా కోపం వచ్చిందని, ఛాతీ పైభాగంతో ఎర్రగా కందిపోయినట్టు తెలిపారు.
Read: ఆర్ఆర్ఆర్ కు కొత్త అర్ధం చెప్పిన భోజన ప్రియులు…
అయితే, ఆ దృశ్యాలు బయటకు రాలేదని ఆమె అన్నారు. హౌస్‌లో జరిగిన విషయాన్ని ఎవరితో చెప్పుకోలేకపోయానని తెలిపారు. సినిమాల్లో కొరియోగ్రాఫర్‌గా బిజీగా ఉన్న సమయంలో బిగ్‌బాస్‌కు వెళ్లడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా మంది అడిగారని, కానీ ఒకసారి డెసిషన్ తీసుకొని అయిపోయాక దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కరెక్ట్ కాదని అన్నారు. హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఒంటరిగానే పోరాటం చేశానని తనకు ఇప్పుడు ఎవరిపై ఎలాంటి కోపం లేదని అనీ మాస్టర్ తెలిపారు.
పూర్తి వీడియో కొసం ఇక్కడ క్లిక్ చేయండి