Site icon NTV Telugu

AP New Cabinet: కొలువుదీరిన కొత్త మంత్రులు..

Ministers Take Oath

Ministers Take Oath

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మంత్రివర్గం కొలువుదీరింది.. పాత మంత్రులతో జరిగిన చివరి కేబినెట్‌ సమావేశంలో.. అందరితో రాజీనామాలు చేయించిన సీఎం వైఎస్‌ జగన్‌.. పాత కొత్త మంత్రుల కలయికతో ఆదివారం రోజు తన కొత్త టీమ్‌ను ప్రకటించారు.. ఇక, ఇవాళ మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించారు గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌.. 25 మంది కొత్త మంత్రుల చేత ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.. ప్రమాణ స్వీకార ఘట్టంలో మొదట సత్తెనపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రమాణ స్వీకారం చేయగా.. చివరగా చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని ప్రమాణం చేశారు.. అక్షర క్రమంలో.. అంబటి రాంబాబు, అంజాద్‌ బాషా, ఆదిమూలపు సురేష్‌, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాలనాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమరనాథ్‌, గుమ్మనూరు జయరాం, జోగి రమేష్‌, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ, నారాయణస్వామి, ఉషాశ్రీ చరణ్‌, మేరుగ నాగార్జున, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పినిపె విశ్వరూప్‌, పి. రాజన్నదొర, ఆర్కే రోజా, సీదిరి అప్పలరాజు, తానేటి వనిత, విడదల రజిని ఇలా వరుసగా ప్రమాణస్వీకారం చేశారు కొత్త మంత్రులు..

Read Also: Botsa Satyanarayana: మంత్రివర్గ కూర్పు అద్భుతం.. సమన్వయంతో ముందుకెళ్తాం..

ఇక, కొత్త మంత్రుల సామాజిక వర్గం, నియోజకవర్గాలు ఓసారి పరిశీలిస్తే..
* పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసీ), పుంగనూరు
* ఆదిమూలపు సురేష్‌ (ఎస్సీ), యర్రగొండ పాలెం
* కళత్తూరు నారాయణస్వామి (ఎస్సీ), గంగాధరనెల్లూరు
* చెల్లు బోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ (బీసీ), రామచంద్రపురం
* బొత్స సత్యనారాయణ (బీసీ), చీపురుపల్లి
* తానేటి వనిత (ఎస్సీ), కొవ్వూరు
* బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి (ఓసీ), డోన్‌
* కారుమూరి వెంకట నాగేశ్వరరావు (బీసీ), తణుకు
* గుమ్మనూరు జయరాం (బీసీ), ఆలూరు
* జోగి రమేష్‌ (బీసీ), పెడన
* సీదిరి అప్పలరాజు (బీసీ), పలాస.
* గుడివాడ అమర్‌నాథ్‌ (ఓసీ), అనకాపల్లి
* షేక్‌ బేపారి అంజాద్‌ బాషా (మైనార్టీ), కడప
* అంబటి రాంబాబు (ఓసీ), సత్తెనపల్లి
* పినిపే విశ్వరూప్‌ (ఎస్సీ), అమలాపురం
* కె.వి.ఉషశ్రీచరణ్‌ (బీసీ), కళ్యాణదుర్గం
* ధర్మాన ప్రసాదరావు (బీసీ), శ్రీకాకుళం
* విడదల రజిని (బీసీ), చిలకలూరిపేట
* ఆర్‌.కె.రోజా (ఓసీ), నగరి
* మేరుగ నాగార్జున (ఎస్సీ), వేమూరు
* బూడి ముత్యాలనాయుడు (బీసీ), మాడుగుల
* కొట్టు సత్యనారాయణ (ఓసీ), తాడేపల్లిగూడెం
* పీడిక రాజన్నదొర (ఎస్టీ), సాలూరు
* దాడిశెట్టి రాజా (ఓసీ), తుని
* కాకాణి గోవర్ధన్‌రెడ్డి (ఓసీ), సర్వేపల్లి

Exit mobile version