అమెరికాలో ఏపీకి చెందిన ఓ వ్యక్తి మృతి చెందడం విషాదం నింపింది. బోస్టన్‌లోని లోగాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో స్నేహితుడిని తీసుకెళ్లడానికి వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్‌కు చెందిన 47 ఏళ్ల వ్యక్తి బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. లెక్సింగ్టన్‌కు చెందిన విశ్వచంద్ కొల్లా గత వారం టెర్మినల్ B సమీపంలో తన కారు వెలుపల నిలబడి ఉండగా, డార్ట్‌మౌత్ ట్రాన్స్‌పోర్టేషన్ మోటార్ కోచ్ అతని కారును ఢీకొట్టింది. దీంతో తీవ్రంగా గాయపడిన విశ్వచంద్ సంఘటనా స్థలంలో మరణించాడు. ప్రమాదం జరిగిన తర్వాత, ప్రయాణికులను బస్సు నుండి దింపారు. టెర్మినల్ B వద్ద మిగిలిన బస్సు సేవలన్నీ రాత్రికి రద్దు చేయబడ్డాయి. మృతుడికి ఇద్దరు పిల్లల ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, ప్రస్తుతం ఎలాంటి నేరారోపణలు నమోదు కాలేదని మసాచుసెట్స్ స్టేట్ పోలీసులు తెలిపారు.
కొల్లా వృత్తిరీత్యా డేటా సైంటిస్ట్. ఇటీవల టకేడాలో డేటా అనలిటిక్స్ డైరెక్టర్‌గా పనిచేశారు. అతను జాన్ హాన్‌కాక్, డెలాయిట్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్, IBM, సన్ మైక్రోసిస్టమ్స్‌లో మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు. అతను NRI వాసవి అసోసియేషన్, గ్రేటర్ బోస్టన్ యొక్క తెలుగు అసోసియేషన్‌తో సహా గ్రేటర్ బోస్టన్ ప్రాంతంలోని తెలుగు భారతీయ సంఘాలలో క్రియాశీల సభ్యుడు. కాగా, గత నెలలోనూ ఏపీకి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తి న్యూజెర్సీలో ఇంటర్-సిటీ రైలు ఢీకొని మరణించారు.