NTV Telugu Site icon

వైర‌ల్‌: బుడ్డోడి టాలెంట్‌కు ఆనంద్ మ‌హీంద్రా ఫిదా…

చిన్న‌ప్ప‌టి నుంచి క‌ష్ట‌ప‌డితే పెద్ద‌య్యాక ఎంత క‌ష్ట‌మైన స‌మ‌స్య‌లు ఎదురైనా స‌రే వాటిని దాటుకొని ముందుకు వెళ్తుంటారు.  చిన్న‌త‌నం నుంచి పోరాడే త‌త్వాన్ని అల‌వ‌రుచుకోవాలి.  ఏదైనా స‌రే ఒక ల‌క్ష్యాన్ని ఎంచుకొని అడుగు ముందుకు వేస్తే ఆ ల‌క్ష్యం మీద‌నే దృష్టి నిల‌వాలి త‌ప్పించి మ‌రోక‌దానిపై దృష్టిని మ‌ర‌ల్చ‌కూడ‌దు.  దానికి ఓ చిన్న ఉదాహ‌ర‌ణ ఈ వీడియో.  ఓ చిన్నారి చిన్న చిన్న రాళ్ల‌ను ప‌ట్టుకొని గోడ ఎక్కుతున్న వీడియోను బిజినెస్ మెన్ ఆనంద్ మ‌హీంద్రా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ల‌క్ష్యాలు అసాధ్యం అనిపించే విధంగా ఉండోచ్చు.  కానీ ఒక‌సారి అడుగు ముందుకు వేస్తే అసాధ్యాన్ని సాధ్యం చేయ‌వ‌చ్చు అని ఆనంద్ మ‌హీంద్రా ట్వీట్ చేశారు.  ఈవీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న‌ది.  

Read: ఎట్ట‌కేల‌కు తాలిబ‌న్ల అండ‌తో మ‌ళ్లీ ప్రారంభించారు…