వ్యాపారంలో ఎంతటి బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో తనదైన శైలిలో పోస్టులు చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షించే వ్యక్తి ఆనంద్ మహీంద్రా. రీసెంట్‌గా ట్విట్టర్‌లో కాళ్లు చేతులు లేని ఓ దివ్యాంగుని వీడియోను పోస్ట్ చేశాడు. కాళ్లు చేతులు లేకున్నా ఆత్మాభిమానంతో టూవీలర్‌ను తనకు అనువైన వాహనంగా మార్పులు చేయించుకొని ఒకచోట నుంచి మరోక చోటుకు వస్తువులను చేరవేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు.
Read: నమ్మకాలు: కొత్త సంవత్సరం రోజున ఇలా చేస్తే…
తనకు భార్య, ఇద్దరు పిల్లలు, పెద్దవయసు తండ్రి ఉన్నాడని, వారిని పోషించుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే తాను ఈ పనిచేస్తున్నట్టు అతను పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పోస్ట్ చేసి, మహీంద్రా లాజిస్టిక్‌లో ఉద్యోగం ఇవ్వాలని ట్వీట్ చేశాడు. తనను మహీంద్రా లాజిస్టిక్ బిజినెస్‌లో అసోసియేట్ చేసుకోవాలని ట్వీట్ చేశారు. అతని వివరాలు తెలుసుకొని ఆఫర్ చేయాలని కోరాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.