NTV Telugu Site icon

ఐరిష్ బిలినియ‌ర్‌కు అదిరిపోయే కౌంట‌ర్ ఇచ్చిన ఆనంద్ మ‌హీంద్రా…

ఇండియ‌న్ టెకీల‌కు ప్ర‌పంచంలో భారీ డిమాండ్ ఉన్న‌ది.  ప్ర‌పంచంలోని టాప్ కంపెనీలు సీఈఓలుగా భార‌తీయుల‌ను నియ‌మించుకుంటున్న‌ది. క‌ష్ట‌ప‌డే తత్వం భార‌తీయుల ల‌క్ష‌ణం కావ‌డంతో కంపెనీ సీఈఓలుగా నియ‌మితుల‌వుతున్నారు.  మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, అడోబ్‌, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వ‌ర్క్ వంటి పెద్ద పెద్ద టెక్ కంపెనీల‌కు సీఈఓలుగా భార‌తీయులు నియ‌మితులైనారు.  తాజాగా సోష‌ల్ మీడియా దిగ్గ‌జం ట్విట్ట‌ర్‌కు ప‌రాస్ అగర్వాల్‌ను ఎంపిక చేశారు.  దీనిపై స్టైప్ కో ఫౌండ‌ర్‌, ఐరిష్ బిలినియ‌ర్ స్పందించి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు.  

Read: ఒమిక్రాన్ ప్ర‌భావం: భారీగా పెరిగిన విమానం చార్జీలు…

ప‌లు అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌కు భార‌తీయులు సీఈఓలు అయ్యార‌ని, ప్ర‌పంచ టెక్నాల‌జీ రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్నార‌ని కొనియాడిన ప్యాట్రిక్ కొలిస‌న్ ఆ వెంట‌నే వ‌ల‌స వ‌చ్చిన వారికి అమెరికా అవ‌కాశాలు క‌ల్పిస్తోంద‌ని ట్వీట్ చేశారు.  ప్యాట్రిక్ కొలిస‌న్ చేసిన ట్వీట్‌పై టెక్ దిగ్గ‌జం ఆనంద్ మ‌హీంద్రా స్పందించారు.  ఇది మరో రకమైన ప్యాండెమిక్‌. ఇది ఇండియా నుంచి వచ్చిందని చెప్పడానికి మేము గర్విస్తున్నాం. ఈ ప్యాండమిక్‌కి కారణం ఇండియన్‌ సీఈవో వైరస్‌. దీనికి వ్యాక్సిన్‌ కూడా లేదని రిప్లై ఇచ్చారు.  ఆనంద్ మ‌హీంద్రా ఇచ్చిన కౌంట‌ర్‌పై నెటిజ‌న్లు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు.