Site icon NTV Telugu

తీరం దాటిన వాయుగుండం..

కనివిని ఎరుగని రీతిలో జలప్రళయం ముంచుకొచ్చింది. తమిళనాడుతో పాటు ఏపీలోనూ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఏపీలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు. చైన్నైకి ఆగ్నేయ దిశగా 150 కిలోమీటర్ల వద్ద వాయుగుండం కేంద్రీకృతమైంది. పశ్చిమ వాయువ్య దిశగా గంటకు 18 కిలోమీటర్ల వేగంతో వాయుగుండం కదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

Also Read : వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు మహిళలు

ఈ రోజు తెల్లవారుజామున 3-4 గంటల మధ్య చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటినట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయుగుండం కారణంగా ఉత్తర తమిళనాడుతో పాటు ఏపీలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని మరోసారి ఐఎండీ హెచ్చరించింది.

Exit mobile version