వరద నీటిలో కొట్టుకుపోయిన నలుగురు మహిళలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడం వాయుగుండంగా మారి తమిళనాడు, ఏపీలో తన ప్రభావం చూపుతోంది. ఈ రోజు ఉదయం చెన్నై-పుదుచ్చేరి మధ్య వాయుగుండం తీరం దాటింది. అల్పపీడనం ప్రభావంతో గత రెండు రోజులుగా చిత్తూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, చెరువుల పొంగిపొర్లుతున్నాయి. అంతేకాకుండా కొన్ని చోట్ల రోడ్లపై వరదనీరు ఉధృతంగా ప్రవహిస్తోంది.

Also Read : నిండుకుండలా కళ్యాణి జలాశయం.. పొంగుతున్న చెరువులు

ఈ క్రమంలో చిత్తూరు జిల్లాలో వరదనీటిలో నలుగురు మహిళలు కొట్టుకుపోయిన ఘటన చోటు చేసుకుంది. బలిజపల్లి చెరువు వద్ద గల కాజ్‌వేపై వరద నీటిలో మహిళలు కొట్టుకుపోయారు. గల్లంతైన మహిళలు బంగారుపాళ్యం మండలం టేకుమండకు చెందిన జయంతి, కస్తూరి, ఉషారాణి, లక్ష్మిదేవిలు తెలుస్తోంది. ఈ మేరకు గల్లంతైన మహిళల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Related Articles

Latest Articles