NTV Telugu Site icon

విద్యుత్, బొగ్గు సంక్షోభంపై కీల‌క స‌మావేశం…

దేశంలో బొగ్గు నిల్వ‌లు అడుగంటిపోయాయి.  క‌రోనా త‌రువాత అన్ని రంగాలు తిరిగి తెరుచుకోవ‌డంతో విద్యుత్ వినియోగం గ‌ణ‌నీయంగా పెరిగింది.  డిమాండ్‌కు త‌గిన‌తంగా విద్యుత్ ఉత్ప‌త్తి జ‌ర‌గ‌డంలేదు.  గ‌తంలో మిగులు విద్యుత్ ఉన్న రాష్ట్రాల్లో కూడా విద్యుత్ ఉత్ప‌త్తి తగ్గిపోయింది.  దేశంలో బొగ్గు ఆధారిత విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు అధికంగా ఉన్నాయి. అయితే క‌రోనా కాలంలో బొగ్గుత‌వ్వ‌కాలు త‌గ్గిపోయాయి.  దీంతో నిల్వ‌లు తగ్గిపోవ‌డంతో సంక్షోభం ఏర్ప‌డింది.  ఈ సంక్షోభంపై ఈరోజు కేంద్ర మంత్రి అమిత్ షా నేతృత్వంలో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేశారు.  ఈ స‌మావేశానికి షా తో పాటుగా విద్యుత్, బొగ్గు గ‌నుల శాఖ మంత్రులు, అధికారులు హాజ‌ర‌య్యారు.  ఈ స‌మావేశంలో దేశంలోని విద్యుత్ ఉత్ప‌త్తికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, బొగ్గు ఉత్ప‌త్తికి సంబందించిన అంశాల‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోబోతున్నారు.  

Read: బీజేపీకి షాక్‌: కాంగ్రెస్‌లో చేరిన ఉత్త‌రాఖండ్ మంత్రి…