బీజేపీకి షాక్‌: కాంగ్రెస్‌లో చేరిన ఉత్త‌రాఖండ్ మంత్రి…

ఉత్త‌రాఖండ్‌లో బీజేపీ ప్ర‌భుత్వానికి పెద్ద షాక్ త‌గిలింది.  ఉత్త‌రాఖండ్ ర‌వాణా శాఖ మంత్రి య‌శ్‌పాల్ ఆర్య‌, ఆయ‌న కుమారుడు సంజీవ్ ఆర్యాతో క‌లిసి ఈరోజు కాంగ్రెస్‌లో చేరారు.  మ‌రికొన్ని నెలల్లో ఉత్త‌రాఖండ్‌కు ఎన్నిక‌లు జ‌ర‌గబోతున్న నేప‌థ్యంలో మంత్రి బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి కాంగ్రెస్ లో చేర‌డంతో అక్క‌డి రాజ‌కీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.  సంజీవ్ ఆర్య ప్ర‌స్తుతం నైనిటాల్ ఎమ్మెల్యేగా కొన‌సాగుతున్నారు.  కాగా, య‌శ్‌పాల్ ఆర్య‌, సంజీవ్ ఆర్యాలు బీజేపీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి, త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేసిన త‌రువాత వీరు కాంగ్రెస్‌లో చేరారు.   2014 వ‌ర‌కు య‌శ్‌పాల్ ఆర్యా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు.  2007 నుంచి 2014 వ‌ర‌కు ఉత్త‌రాఖండ్ ప్ర‌దేశ్ కాంగ్రెస్ క‌మిటీ అధ్య‌క్షుడిగా ప‌నిచేశారు.  2014లో య‌శ్‌పాల్ బీజేపీలో చేరారు.  మ‌ర‌లా ఇప్పుడు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేర‌డం ప‌ట్ల ఆ పార్టీ అధిష్టానం సంతోషాన్ని వ్య‌క్తం చేసింది.  య‌శ్‌పాల్ తిరిగి కాంగ్రెస్‌లో చేర‌డం సొంతింటికి తిరిగి రావ‌డం లాంటిద‌ని ఎంపీ కేసీ వేణుగోపాల్ పేర్కొన్నారు.  

Read: వెంట‌నే వ‌దిలి వెళ్లిపోండి… వారికి అమెరికా సూచ‌న‌…

-Advertisement-బీజేపీకి షాక్‌:  కాంగ్రెస్‌లో చేరిన ఉత్త‌రాఖండ్ మంత్రి...

Related Articles

Latest Articles