Site icon NTV Telugu

USA: టెక్సాస్‌లో చల్లారని కార్చిచ్చు.. భారీగా ఆస్తులు బుగ్గిపాలు

Taxes

Taxes

అమెరికాలోని (America) టెక్సాస్‌లో (Texas) చెలరేగిన కార్చిచ్చు బీభత్సం సృష్టిస్తోంది. ఇప్పటికే కోట్లాది రూపాయల ఆస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. పలు ఇళ్లు, కార్లు మంటల్లో ఖాళీ పోయాయి. మరోవైపు నగరాలు.. నగరాలనే అధికారులు ఖాళీ చేయింయారు. దాదాపుగా ఏడు అడవుల్లో మంటలు చెలరేగుతున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరుకు 8లక్షలకు పైగా ఎకరాలు బుగ్గిపాలైనట్లు సమాచారం. టెక్సాస్‌కు ఉత్తర నగరం సమీపంలో ఉన్న అణు ఆయుధ కరక్మాగారాన్ని తాత్కాలికంగా అధికారులు మూసివేశారు. 60 కౌంటీలకు గవర్నర్ విపత్తు స్థితిని ప్రకటించారు. ప్రజలు కార్చిచ్చు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మరోవైపు కార్చిచ్చు బీభత్సం కారణంగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు కారణంగానే కార్చిచ్చు భారీ ఎత్తున పెరిగిందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేరుస్తు్న్నారు.

 

Exit mobile version