NTV Telugu Site icon

MLC Elections: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. రేపే పోలింగ్

Mlc Elections

Mlc Elections

ఆంధ్రప్రదేశ్ లో 5 ఎమ్మెల్సీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. సోమవారం జరగనున్న 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రశాంతమైన వాతావరణంలో పోలింగ్ జరిగేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బందిని నియమించినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.
Also Read:Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌పై మరోసారి రాళ్లదాడి..

ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి మొత్తం ఆరు జిల్లాల్లో 331 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేశారు. రెండు లక్షల 9 వేల మంది ఓటర్లు తమ ఓటును నమోదు చేసుకోగా.. ఇప్పటికే ఓటర్ స్లిప్పులు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం అనకాపల్లి జిల్లాలో 49, అల్లూరి జిల్లాలో 15, విజయనగరం జిల్లాలో 72, మన్యం జిల్లాలో 24, శ్రీకాకుళం జిల్లాలో 59 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read:IT Raids in Telugu States Live: ఎందుకు తెలుగు రాష్ట్రాల్లో ఐటీ సోదాలు?

మొత్తం 5 ఎమ్మెల్సీ స్థానాలను దక్కించుకోవాలని అధికారపార్టీ ఉవ్విలూరుతుండగా, అటు విపక్షాలు ఆ స్థానాలను దక్కించుకునేందుకు జోరుగా ప్రచారం చేశాయి. తూర్పు, పశ్చిమ రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖలో గ్రాడ్యుయేట్‌ స్థానాలకు ఎన్నికలు, ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు టీచర్స్‌ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నెల 16న ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. అనంతరం ఫలితాలు ప్రకటిచంనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో మద్యం షాపులను బంద్‌ చేయడంతోపాటు పోలీసు బందోబస్తు పెంచారు.

Show comments