Site icon NTV Telugu

జాక్ మా కీల‌క‌ నిర్ణ‌యం: రికార్డ్ స్థాయిలో ప‌డిపోయిన అలీబాబా షేర్లు…

చైనా జెయింట్ ఈ కామ‌ర్స్ దిగ్గ‌జం అలీబాబా కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది.  త్వ‌ర‌లోనే దేశీయ‌, అంత‌ర్జాతీయ ఈ కామ‌ర్స్ వ్యాపారాల‌ను పున‌ర్వ‌వ‌స్థీకరిస్తామ‌ని చెప్పింది.  ఈ ప్ర‌క‌ట‌న‌తో అలీబాబా షేర్లు భారీగా ప‌డిపోయాయి.  క‌రోనా స‌మ‌యంలో అలీబాబా వ్య‌వ‌స్థాప‌కుడు జాక్‌మా చైనా బ్యాంకుల‌కు, ప్ర‌భుత్వానికి ప‌లు సూచ‌న‌లు, స‌ల‌హాలు ఇచ్చారు.  ఆ త‌రువాత దాదాపు మూడు నెల‌ల పాటు జాక్‌మా ఎవ‌రికీ క‌నిపించ‌లేదు.  ఎమ‌య్యారో తెలియ‌లేదు.  ఆ త‌రువాత బ‌య‌ట‌కు వ‌చ్చినా ఆయ‌న పెద్దగా యాక్టీవ్‌గా క‌నిపించ‌డం లేదు.  గ‌తంలో మాదిరిగా సోష‌ల్ మీడియాలో దూకుడుగా ప్ర‌సంగాలు చేయ‌డం లేదు.  చాలా సైలెంట్ అయిపోయారు.  కాగా, ఇప్పుడు ఆలీబాబా సంస్థ జాతీయంగా, అంత‌ర్జాతీయంగా ఈ కామ‌ర్స్ వ్యాపారాల‌ను పున‌ర్వ‌వ‌స్థీక‌రించి, సీఎఫ్ఓల‌ను కూడా మార్చేందుకు సిద్దం అయింది.  మంద‌గిస్తున్న ఆర్థిక వ్య‌వ‌స్థ‌, పెరుగుతున్న పోటీ, దేశంలో అణిచివేత త‌దిత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకొని ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ది.  

Read: ఒమిక్రాన్ టెన్ష‌న్‌: ఆ 13 మందికి నెగెటివ్‌…

ఇప్ప‌టి వ‌ర‌కు అలీబాబా ప్ర‌పంచ వ్యాప్తంగా సొంతంగా ఈ కామ‌ర్స్ వ్యాపారాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్న‌ది.  కాగా ఇప్పుడు దానిని రెండు భాగాలుగా చేసింది.  ఒక‌టి అంత‌ర్జాతీయ డిజిట‌ల్ వాణిజ్యం కాగా రెండోది జాతీయ డిజిట‌ల్ వాణిజ్యం.  రెండు ర‌కాలుగా విభ‌జించ‌డం వ‌ల‌న మంద‌గించిన వ్యాపారాన్ని తిరిగి గాడిలో పెట్ట‌డ‌మే కాకుండా మ‌రింత అభివృద్ది చెందేలా చేయ‌వ‌చ్చ‌న్న‌ది అలీబాబా సంస్థ ఉద్దేశం.  అంత‌ర్జాతీయ డిజిట‌ల్ వాణిజ్యాన్ని ఆలీ ఎక్స్‌ప్రెస్ నిర్వ‌హిస్తుంది.  యూర‌ప్‌, ద‌క్షిణ అమెరికా దేశాల్లో కార్య‌క‌లాపాలు కొన‌సాగిస్తుంది.  ఆగ్నేయ ఆసియాలో ఈ కామ‌ర్స్ ను ల‌జాడా సంస్థ నిర్వ‌హిస్తుంది.  ఇక అలీబాబా.కామ్ సంస్థ విదేశీ వ్యాపార వినియోగ‌దారుల‌పై దృష్టి సారిస్తుంది.  అలీబాబా తీసుకున్న ఈ నిర్ణ‌యంతో దేశీయ మార్కెట్లు కుదేల‌య్యాయి

Exit mobile version