Site icon NTV Telugu

బ్రేకింగ్‌: ఆకాష్‌ అంబానీ చేతికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ పగ్గాలు..

భారతదేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యం రియలన్స్‌ ఇండస్ట్రీస్‌ పగ్గాలు ముఖేష్‌ కుమారు ఆకాష్‌ అంబానీ చేతుల్లోకి వెళ్లాయి. ఇటీవల ధీరుబాయ్‌ అంబానీ జయంతి సందర్భంగా ఏటా జరిపే రిలయన్స్‌ ఫ్యామిలీ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ముఖేష్‌ అంబానీ రిలయన్స్‌ కంపెనీ చైర్మన్‌ మారుతాడని, అంతేకాకుండా మరికొన్ని మార్పులు కూడా ఉంటాయని చెప్పారు. ఆయన చెప్పిన విధంగానే నేడు ఆయన కుమారు ఆకాష్‌ అంబానీకి రిలయన్స్‌ సంస్థ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.

అయితే ధీరుభాయ్‌ అంబానీ అనంతరం ముఖేష్‌, అనిల్‌ అంబానీలు ఉన్నత శిఖరాలు అవరోధించినా.. అనిల్‌ అంబానీ మాత్రం ముఖేష్‌ అంబానీలా లేకపోయారు. ఇప్పుడు ముఖేష్‌ అంబానీ తరువాత తన స్థానంలో ఆకాష్ అంబానీని కూర్చబెడుతున్నారు. ఇప్పడు ఆకాష్‌ అంబానీ తాత ధీరుబాయ్ అంబానీ తగ్గ మనవడిగా పేరు తెచ్చుకుంటారో చూడాలి..

Exit mobile version