మరోసారి ‘బిగ్‌బాస్’ షో హోస్ట్‌గా రమ్యకృష్ణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ అన్ని భాషల్లోనూ ప్రేక్షకుల ఆదరణ పొందింది. తెలుగులో ప్రస్తుతం ఐదో సీజన్ నడుస్తుండగా.. మంచి టీఆర్పీలను సొంతం చేసుకుంటోంది. తెలుగు బిగ్‌బాస్ షోను హీరో నాగార్జున హోస్ట్ చేస్తున్నాడు. మరోవైపు తమిళంలోనూ బిగ్‌బాస్‌కు మంచి రేటింగ్స్ వస్తున్నాయి. తమిళంలో ఈ షోకు ప్రముఖ హీరో కమల్ హాసన్ హోస్టుగా వ్యవహరిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతుండటంతో బిగ్‌బాస్‌కు ఎవరు యాంకర్‌గా వ్యవహరిస్తారన్న విషయంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
Read Also: టిక్కెటింగ్ సిస్టంపై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు
Also Read
- Supreme Court: ‘న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు’ రాహుల్‌గాంధీ యాత్రపై సీజేఐ కీలక వ్యాఖ్యలు
- Pakistan: పాకిస్థాన్‌లో ఘోర విషాదం.. పాఠశాల పైకప్పు కూలి 28 మంది విద్యార్థులు, టీచర్ మృతి
- Imran khan: సీఈసీకి వ్యతిరేకంగా నిరసన.. 28 లోగా భారత్ విడిచి వెళ్లాలని ఇమ్రాన్ ఖాన్‌కు నోటీసు
- Germany: జర్మనీలో ముగ్గురు భారతీయులు అనుమానాస్పద మృతి.. రొమేనియా జాతీయుడు అరెస్ట్
కమల్ అనారోగ్యం బారిన పడటంతో ఆయన తిరిగివచ్చేదాకా కమల్ కుమార్తె శ్రుతిహాసన్ బిగ్‌బాస్‌కు హోస్టుగా చేస్తారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే శ్రుతిహాసన్ సినిమాల్లో బిజిబిజీగా గడుపుతోంది. ఆమెకు బిజీ షెడ్యూల్ ఉన్న కారణంగా ఆమె బిగ్‌బాస్ ఆఫర్‌ను తిరస్కరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంలో నిజనిజాలు ఎలా ఉన్నా ప్రత్యామ్నాయం కోసం బిగ్‌బాస్ నిర్వాహకులు ఆలోచిస్తుండగా వారికి మంచి ఆప్షన్ కనిపించింది. దీంతో వీకెండ్ హోస్టుగా ప్రముఖ నటి రమ్యకృష్ణను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణకు గతంలో బిగ్‌బాస్ షోను నడిపించిన అనుభవం ఉంది. అయితే ఆమె తమిళంలో కాకుండా తెలుగు బిగ్‌బాస్‌కు గతంలో హోస్టుగా వచ్చింది. తెలుగులో మూడో సీజన్ నడుస్తున్న సమయంలో నాగార్జున తన పుట్టినరోజు సందర్భంగా విహారయాత్రకు వెళ్లడంతో ఆ సమయంలో రమ్యకృష్ణ హోస్టు అవతారం ఎత్తి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఆమె నాగార్జున నటిస్తున్న ‘బంగార్రాజు’ సినిమాలో నటిస్తోంది.
తాజావార్తలు
-
Kanaka Durgamma Temple: సరస్వతీ దేవి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. కిటకిటలాడుతున్న ఇంద్రకీలాద్రి!
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!
-
Punam Raut: టీమిండియాకు షాక్.. జింబాబ్వే సిరీస్‌కు ఒక్క రోజు ముందు స్టార్ బ్యాట్స్‌మెన్ రిటైర్మెంట్ ప్రకటన..
-
Friday Astrology: శుక్రవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి నేడు తిరుగుండదు, లాభాలే లాభాలు!
-
కేవలం 25 కార్లే.. వచ్చీ రాగానే సేల్ అవుట్.! Jeep Wrangler Whitecap Mojito లాంచ్..
ట్రెండింగ్
-
Water Can Cleaning: 20 లీటర్ల నీళ్ల క్యాన్‌ను ఇలా కడుగుతున్నారా? ఈ తప్పులు వద్దు.!
-
Upma Rava vs Idli Rava : ఉప్మా రవ్వ, ఇడ్లీ రవ్వ ఒకటి కాదు.. అసలు తేడా ఇదే!
-
Small Kitchen Ideas: వంటగది కౌంటర్ ఎప్పుడూ తడిగా, చిందరవందరగా ఉంటుందా? ఈ చిన్న ప్లానింగ్ చేసుకోండి!
-
How To Grow Moringa: పోషకాల నిధి మునగ.. కుండీలో మురింగ చెట్టును ఈజీగా పెంచే టిప్స్ మీ కోసం..
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!