NTV Telugu Site icon

700 ఏళ్లుగా ఆ ఊర్లో వింత ఆచారం… అమ్మాయి కాదు… అబ్బాయి అలా…

సాధార‌ణంగా పెళ్లైన త‌రువాత అమ్మాయిలు అత్తారింటికి వెళ్తుంటారు.  పెట్టినిల్లు వ‌దిలి మెట్టినింటికి వెళ్తారు.  అది అనాది కాలం నుంచి వ‌స్తున్న సంప్ర‌దాయం.  అమ్మాయి కాకుండా అబ్బాయి అత్త‌వారింటికి వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డితే వాళ్ల‌ను ఒక‌లాగా చూస్తారు.  అత్త‌వారింటికి వెళ్లి కూర్చొని తిన‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. వాడు చూడు ఇల్ల‌రికం వెళ్లాడు…అని చుల‌క‌న‌గా చూస్తారు.  కానీ, రాజ‌స్థాన్‌లోని మౌంట్ అబు న‌గ‌రానికి 10 కిలోమీట‌ర్ల దూరంలో జ‌వాయి అనే గ్రామం ఉన్న‌ది.  

Read: అనంతపురంలో విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. టీడీపీ నేత లోకేష్ ఆగ్రహం

ఆ గ్రామంలో 700 ఏళ్లుగా ఓ వింత ఆచారం కొన‌సాగుతున్న‌ది.  పెళ్లైన త‌రువాత అబ్బాయిలు ఇల్ల‌రికం వ‌స్తారు.  అత్త‌వారింటికి వ‌చ్చి అక్క‌డే స్థిర‌ప‌డ‌తారు.  అక్క‌డే ప‌నులు చూసుకుంటారు. అంద‌రిలా కాకుండా జ‌వాయి గ్రామంలో ఎందుకు వింత ఆచారం కొన‌సాగుతుంది అని అంటే మాత్రం దానికి స‌రైన స‌మాధానం ఎవ‌రి ద‌గ్గ‌రా లేదు.  700 ఏళ్లుగా వ‌స్తున్న సంప్ర‌దాయాన్ని కొన‌సాగిస్తున్నామ‌ని మాత్రం అక్క‌డి ప్ర‌జ‌లు చెబుతున్నారు.