Site icon NTV Telugu

మెట్టుదిగిన తాలిబ‌న్‌: ఏ దేశంతోనూ మాకు…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో తాలిబ‌న్ ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఏ దేశం ఆ ప్ర‌భుత్వాన్ని అధికారికంగా గుర్తించ‌లేదు.  అయితే, అక్క‌డి ప‌రిస్థితులు దారుణంగా మారిపోవ‌డంతో మాన‌వ‌తా దృక్ప‌ధంతో ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డానికి అనేక దేశాలు ముందుకు వ‌స్తున్నాయి.  అందులో ఇండియా ప్ర‌ధమంగా ఉన్న‌ది.  ఇండియా చొర‌వ‌తీసుకొని అక్క‌డి ప్ర‌జ‌ల‌కోసం ఆహార‌ధాన్యాలు ఇత‌ర స‌హాయ స‌హ‌కారాలు అందిస్తోంది.  ఇతీవ‌లే భార‌త్ 8 దేశాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది.  ఆఫ్ఘ‌నిస్తాన్ ప్ర‌ధానాంశంగా ఈ స‌ద‌స్సు జ‌రిగింది.  ఈ స‌ద‌స్సులో ఆఫ్ఘ‌నిస్తాన్ లో నెల‌కొన్న ప‌రిణామాలు, అక్క‌డి ప్ర‌జ‌ల ప‌రిస్థితులు త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.

Read: నవంబర్ 15, సోమవారం దినఫలాలు: ఉద్యోగస్తులు జాగ్రత్త

ఇక ఇదిలా ఉంటే, ఇత‌ర దేశాల‌తో సంబంధాలు, దాడులు త‌దిత‌ర అంశాల‌పై ఆఫ్ఘ‌న్ తాలిబ‌న్ విదేశాంగ‌శాఖ మంత్రి స్పందించారు.  అంత‌ర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో కీలక అంశాల‌ను పేర్కొన్నారు.  భార‌త్‌తో స‌హా ఏ దేశంతోనూ త‌మ‌కు విరోదం లేద‌ని, ఏ దేశాన్ని వ్య‌తిరేకించ‌డం లేద‌ని అన్నారు.  అదేవిధంగా, గ‌త ప్ర‌భుత్వంలో ప‌నిచేసిన మ‌హిళ‌లు ఈ ప్ర‌భుత్వంలో కూడా ప‌నిచేస్తున్నార‌ని, వైద్య‌రంగంలో 100 శాతం మ‌హిళ‌ల భాగ‌స్వామ్యం ఉంటుంద‌ని, విద్యారంగంలో కూడా మ‌హిళ‌లు ప‌నిచేస్తున్నారని తాలిబ‌న్ విదేశాంగ‌శాఖ మంత్రి తెలిపారు. 

Exit mobile version