NTV Telugu Site icon

మ‌హిళ‌తో ఏనుగు దాగుడుమూత‌లు… టోపీని దాచేసి…

ఏనుగు తెలివైన జంతువు.  స్నేహం చేస్తే మ‌నిషితో ఏనుగులు క‌లిసిపోతాయి. కోపం వ‌స్తే ఎలాంటి వాటినైనా స‌రే ఎత్తి అవ‌త‌ల ప‌డేస్తాయి.  వాటి మూడ్‌ను బ‌ట్టి మ‌స‌లుకోవాలి.  ఒక్కోసారి ఏనుగులు ఫ‌న్నీగా ప్ర‌వ‌ర్తిస్తంటాయి.  ఇలాంటి సంఘ‌ట‌న ఒక‌టి ఇటీవ‌లే జ‌రిగింది.  ఓ మ‌హిళ ఏనుగు ముందు హ్యాట్ పెట్టుకొని నిల‌బ‌డి ఫొటో దిగింది.  అదే స‌మ‌యంలో ఏనుగు ఆ మ‌హిళ హ్యాట్‌ను తీసుకొని నోట్లో పెట్టుకుంది.  ఆనూహ్యంగా జ‌రిగిన ఆ సంఘ‌ట‌న‌ల‌కు ఆ మ‌హిళ షాక్ అయింది.  పెద్ద‌గా న‌వ్వితే ఏనుగుకు ఎక్క‌డ కోపం వ‌స్తుందో అని భ‌య‌ప‌డింది.  అలానే నిల‌బ‌డి ద‌య‌చేసి నా హ్యాట్ ఇవ్వ‌వూ అంటూ బ‌తిమిలాడింది.  ఆమె వేడుకోలును మ‌న్నించిన ఏనులు హ్యాట్‌ను తిరిగి ఇచ్చేసింది.  దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో పోస్ట్ కాగా 14 మిలియ‌న్ల మంది వీక్షించారు.  

Read: వైర‌ల్‌: తాలిబ‌న్ నాయ‌కుడికి పాక్ జ‌ర్న‌లిస్ట్ ప్లైయింగ్ కిస్‌… వీడియో లీక్..