దేశంలో కరోనా వ్యాక్సిన్లు యుద్ధ ప్రాతిపదికన వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇద్దరు బామ్మలు సమ్ థింగ్ స్సెషల్ గా నిలిచారు. వ్యాక్సిన్ వేయించుకోవడంలో ఔరా అనిపించారు. జిల్లాలో కరోనా టీకా తీసుకున్నారు ఈ ఇద్దరు వందేళ్ల వృద్ధులు. భీం పూర్ మండలం తాంసీ కే కు చెందిన వాంకడే తాను బాయి, గాదిగూడకు చెందిన సాబ్లే కమలా బాయిలు కరోనా వ్యాక్సిన్ వేయించుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు.
వీరి వయసు 100కు పైమాటే. ఈ వయసులోనూ ఎంతో బాధ్యతగా, ఓపికగా వారు వ్యాక్సిన్ వేయించుకోవడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. వీరిలో వాంకడే తాను బాయికి వందేళ్ళు, సాబ్లే కమలా బాయికి మాత్రం 102 ఏళ్ళు. ఈ ఇద్దరినీ ప్రత్యేకంగా అభినందించారు జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.వ్యాక్సిన్ వేయించుకోమని నెత్తీనోరూ బాదుకున్నా స్పందించని బద్ధకస్తులు ఈ బామ్మల్ని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో వుంది.