Site icon NTV Telugu

అదానీ చేతికి మ‌రో అతిపెద్ద ప్రాజెక్ట్‌…

దేశంలో మ‌రో పెద్ద ప్రాజెక్ట్‌కు కేంద్ర ప్ర‌భుత్వం శ్రీకారం చుట్టింది.  యూపీలో ఇప్ప‌టికే య‌మునా ఎక్స్‌ప్రెస్ వే ఉండ‌గా, మ‌రో ఎక్స్‌ప్రెస్ వే ను నిర్మించేందుకు సిద్ధ‌మ‌యింది.  ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో ఏకంగా 464 కిమీ ఎక్స్‌ప్రెస్ వే ప్రాజెక్టును అదానీ ఎంట‌ర్‌ప్రైజ‌స్ ద‌క్కించుకుంది.  ఇందులో భాగంగా తొలిద‌శకింద బుధౌన్ నుంచి ప్ర‌యాగ్‌రాజ్ వ‌ర‌కు నిర్మించ‌బోతున్నారు.  ఈ ప్రాజెక్టు విలువ రూ. 17 వేల కోట్లు.  పీపీపీ కింద ప్ర‌భుత్వ, ప్రైవేట్ కంపెనీల భాగ‌స్వామ్యంతో దీనిని నిర్మిస్తున్నారు.  

Read: ఒమిక్రాన్ టెన్ష‌న్‌: క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ జ‌రిగితే ఏంచేయాలి…!!

ఇప్ప‌టికే అదానీ గ్రూప్ దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టుల‌ను సొంతం చేసుకుంది.  సోలార్‌, విండ్‌, రియ‌ల్ ఎస్టేట్‌, పోర్టుల నిర్మాణం వంటి రంగాల్లో అదానీ గ్రూప్ ప్రాజెక్టుల‌ను చేప‌డుతున్న‌ది. ప్ర‌భుత్వ ప్రాజెక్టుల‌లో సింహ‌భాగం ప్రాజెక్టుల‌ను అదానీ గ్రూప్ సొంతం చేసుకోవ‌డం విశేషం.  

Exit mobile version