ఇటీవలే తెలుగు నటి చౌరాసియాపై కేబీఆర్ పార్క్ వద్ద ఓ ఆగంతకుడు దాడి చేసిన సంగతి తెలిసిందే. కేబీఆర్ పార్క్‌లో ఎప్పటిలాగే వాకింగ్ కోసమని వెళ్లాలనని, పార్క్ నుంచి బయటకు వస్తుంటే ఓ వ్యక్తి తనపై దాడి చేశాడని నటి చౌరాసియా తెలియజేసింది. తన మొబైల్ ఫోన్, డైమండ్ రింగ్ లాక్కోవడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో తన మొహంపై గుద్దాడని తెలిపింది. తన దగ్గర డబ్బులు లేవని, కావాలంటే ఫోన్‌పే చేస్తానని, నెంబర్ ఇవ్వమని అడిగినట్టు నటి తెలిపింది.
అతనితో మాట్లాడుతూనే తాను రెండుసార్లు 100 కి డయల్ చేసినట్టు తెలిపింది. అయితే, అది గమనించిన ఆ వ్యక్తి తనను పొదల్లోకి తోశాడని పెద్ద బండరాయిని తన తలపై వేయబోయాడని తెలియజేసింది. తాను పక్కకు తప్పుకొని అతిని ప్రైవేట్ పార్ట్‌పై కాలితో తన్ని అక్కడి నుంచి తప్పించుకొని రోడ్డు మీదకు వచ్చానని, రోడ్డుమీద జనాలను చూసి దుండగుడు పారిపోయాడని చౌరాసియా తెలిపింది. దొంగతనం చేసేందుకు వచ్చాడని, చూస్తే తనను తప్పకుండా గుర్తుపడతానని చెప్పింది చౌరాసియా.
