సీఎం కేసీఆర్ తెలంగాణలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా అమలు కోసం ప్రభుత్వం కార్యచరణ మొదలుపెట్టింది. నియోజకవర్గానికి వంద కుటుంబాల చొప్పున ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో దళితబంధు లబ్దిదారుల ఎంపికపై ప్రభుత్వం సమాచోనలు చేస్తోంది. ఈ క్రమంలో లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
ఫైలెట్ ప్రాజెక్ట్ ప్రాంతాల్లో పరిమితి లేకుండా దళితబంధు అమలు చేసేందుకు కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలో కోడ్ ఆఫ్ కండక్ట్ కారణంగా ఈ పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అయితే ఇప్పుడు దళితబంధుపై కేసీఆర్ సర్కార్ దృష్టి పెట్టింది.