Site icon NTV Telugu

ఆచార్య నుంచి ‘సిద్ధ’ రాకకు ముహూర్తం ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘ఆచార్య’. ఈ మూవీలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ కూడా కనిపించనున్నాడు. అతడు ఈ సినిమాలో ‘సిద్ధ’గా అభిమానులకు కనిపించనున్నాడు. ఇప్పటివరకు రామ్‌చరణ్ లుక్స్ మాత్రమే సినిమా యూనిట్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు చెర్రీని ‘సిద్ధ’గా పరిచయం చేస్తూ టీజర్‌ను విడుదల చేయనుంది. ఈ టీజర్ ఎప్పుడు ఏ సమయానికి విడుదల చేస్తున్నామో తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది.

Read Also: సల్మాన్ ఖాన్ ఇంటికి కోడలిగా సోనాక్షి సిన్హా..?

నవంబర్ 28న సాయంత్రం 4 గంటల 5 నిమిషాలకు సిద్ధ టీజర్ విడుదల చేయనున్నట్లు ఆచార్య చిత్ర బృందం వెల్లడించింది. ఈ మేరకు మేకింగ్ వీడియోను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు, పలు పోస్టర్లు మెగా అభిమానులను విపరీతంగా అలరించాయి. ఈ మూవీని కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై స్వయంగా రామ్‌చరణ్ నిర్మిస్తున్నాడు. ఫిబ్రవరి 4న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ మూవీకి మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూరుస్తున్నాడు.

Exit mobile version