Site icon NTV Telugu

ఓఆర్ఆర్ పై రోడ్డు ప్రమాదం.. ఐదుగురికి గాయాలు

ఓఆర్ఆర్ నుంచి కోదాడ వెళ్లే దారిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పొగ మంచు కారణంగా రోడ్డు ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడ్డవారిని ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా వుందని తెలుస్తోంది. కారు వెనుకనుండి ఢీకొట్టింది లారీ. వాళ్లని హాస్పటల్ కు తరలించే సమయంలో మరో కారు ఆగింది. అంతేకాదు, ఆ కారు వచ్చి ఆగి ఉన్న కారును ఢీ కొట్టింది. గాయపడ్డవారు ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం. ఒకరి మృతి

ఇదిలా వుండగా.. ఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం సంభవించింది. చిలుకానగర్‌లో ఎన్ఎస్ స్కూల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. టిప్పర్ కింద పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. బైక్‌పై వెళ్తుండగా అదుపుతప్పి టిప్పర్ వెనుక టైర్ కింద పడటంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్రగాయాలు కాగా.. ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన వ్యక్తి నాచారం వాసి విశాల్‌సింగ్‌(25)గా గుర్తించారు. సీసీటీవీ కెమెరాలో ప్రమాదం దృశ్యాలు రికార్డయ్యాయి.

https://ntvtelugu.com/passenger-train-burnt-down-in-up/
Exit mobile version