NTV Telugu Site icon

సింగరేణి కేటీకే 1వ గనిలో ప్రమాదం

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని సింగరేణి కేటీకే 1వ గనీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం ఘటనను గోప్యంగా ఉంచారు అధికారులు. కెటికె 1 గని లో ఫస్ట్ షిఫ్ట్ లో పనిచేస్తున్న ఇద్దరు కార్మికులకు పైన రూప్ గోడలు కూలి మీద పడ్డాయి. దీంతో కార్మికులు గాయపడ్డారు. ప్రమాదం ఘటనలో ఒకరికి కాలు పైన నుండి దూసుకెళ్లిన ఎస్.డి.ఎల్ వాహనం. దీంతో కాలి ఎముకలు విరిగిపోయాయి. కార్మికునికి స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు అధికారులు.

రూప్ పెళ్ళ మీద పడి తీవ్రంగా గాయపడ్డ మరో కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు అధికారులు. ప్రమాదం జరిగిన విషయాన్ని గోప్యంగా ఉంచారు సింగరేణి అధికారులు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి రావడంతో సింగరేణిలో హాట్ టాపిక్ గా మారింది ప్రమాద ఘటన.