రామ్ ను ఢీ కొట్టబోతున్న ఆది పినిశెట్టి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రామ్ పోతినేని, కృతిశెట్టి జంటగా లింగుస్వామి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న యాక్షన్ ఎంటర్ టైనర్ షూటింగ్ శరవేగంగా సాగిపోతోంది. ఇటీవల ఈ సినిమా షూటింగ్ స్పాట్ కు తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ వచ్చి అందరినీ ఆశ్చర్యపర్చడంతో పాటు అభినందించి వెళ్ళారు. హైదరాబాద్, వైజాగ్ లో ఈ సినిమా షెడ్యూల్స్ ను ప్లాన్ చేశారు శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ అధినేత శ్రీనివాస్ చిట్టూరి. చిత్రం ఏమంటే… రామ్ తో ఈ మూవీలో ఎవరు ఢీ కొట్టబోతున్నారనే విషయంలో ఇంతవరకూ క్లారిటీ రాలేదు. ఇందులో విలన్ పాత్రను దర్శకుడు లింగుస్వామి చాలా డిఫరెంట్ గా, పవర్ ఫుల్ గా రాసుకున్నాడని తెలుస్తోంది. అందుకోసం ఓ సాలీడ్ విలన్ కోసం ఆయన చూస్తున్నారట. ఆ మధ్య వరకూ ఇందులో మాధవన్ విలన్ గా నటిస్తాడనే ప్రచారం జరిగింది. కానీ దాన్ని ఆయన స్వయంగా ఖండించాడు. ఆ తర్వాత ఆర్య పేరు వెలుగులోకి వచ్చింది.
బట్ తాజా సమాచారం ఏమంటే… ఈ యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్ టైనర్ లో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించబోతున్నాడట. ప్రస్తుతం హీరోగా మూడు నాలుగు సినిమాల్లో చేస్తున్న ఆది…. డెప్త్ ఉండాలే కానీ ప్రతినాయకుడి పాత్ర చేయడానికీ వెనుకాడడు. అందుకు ‘సరైనోడు’ మూవీలో అతను పోషించిన వైరం ధనుష్ పాత్రే ఓ ఉదాహరణ. అంతేకాదు… ఈ సినిమా నిర్మాత శ్రీనివాస్ చిట్టూరితోనూ ఆది పినిశెట్టికి చక్కని అనుబంధం ఉంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ లో వచ్చిన తొలి చిత్రం ‘యూ టర్న్’లో ఆది ఎస్.ఐ. నాయక్ పాత్రను పోషించాడు. అందుకే ఈ బైలింగ్వల్ మూవీలో ఆదిని విలన్ క్యారెక్టర్ కు ఖరారు చేసినట్టు సమాచారం.
Also Read
- Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
- Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
- Koti Deepotsavam 2026 Day-8 Live: నేడు మరో విశేష ఘట్టం.. నరసింహస్వామి మహాభిషేకం.. తులసీ దామోదర కల్యాణం
- Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
తాజావార్తలు
-
Gold Loan Recovery: గోల్డ్ లోన్ తీసుకున్న వారికి షాక్.. గండం ముంచుకొస్తోంది!
-
Deputy CM Pawan Kalyan: రామాంజులు మృతిపై పవన్ ఆరా.. నాగులగుట్టపల్లి ఘటనపై కీలక ఆదేశాలు..
-
IPL 2027-SRH: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు గుడ్‌న్యూస్.. ఐపీఎల్ 2027లో ఆడనున్న స్టార్ ప్లేయర్!
-
AP Panchayat Elections 2026: పంచాయతీ ఎన్నికల్లో కీలక మార్పులు.. పోలింగ్ కేంద్రాల విలీనంపై ఈసీ ఉత్తర్వులు
-
చిన్న గదికి అదిరిపోయే స్మార్ట్ టీవీ.. Xiaomi Google TVపై రూ.12,000ల భారీ డిస్కౌంట్..!
ట్రెండింగ్
-
IND vs NZ: ముగిసిన నాలుగో రోజు ఆట.. డ్రా దిశగా కివీస్ పోరాటం.. భారత్ విజయానికి మరో 8 వికెట్ల దూరంలో..!
-
Jacob Duffy: బ్యాట్‌తో కాదు.. బంతితో డబుల్ సెంచరీ.. 22 ఏళ్ల తర్వాత అరుదైన రికార్డు..!
-
Global Peace Honors: ‘గ్లోబల్ పీస్ హానర్స్’లో తారల సందడి.. సచిన్‌కు ప్రత్యేక గౌరవం..!
-
IND vs NZ Test: టీమిండియా బ్యాటర్ల ఊచకోత.. భారీ ఆధిక్యంలో భారత్..!
-
Kimchi Day : కిమ్చీ.. కొరియా వంటకం వెనుక ఆరోగ్య రహస్యం