Site icon NTV Telugu

ఏకే రావు కేసులో ట్విస్ట్‌.. ఆ రిపోర్ట్‌ కీలకంగా మారనుందా..?

టాలీవుడ్‌ సింగర్‌ హరిణి తండ్రి, సుజాన ఫౌండేషన్‌ సీఈవో ఏకే రావు మృతి కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. వారం రోజులుగా కనిపించకుండపోయిన హరిణి కుటుంబ సభ్యులు.. బెంగుళూరు సమీపంలో ఓ రైల్వే ట్రాక్‌పై ఏకే రావు మృతదేహం లభ్యమయ్యాక రైల్వే పోలీస్‌ స్టేషన్‌లో ప్రత్యక్షమయ్యారు. ఏకే రావు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ముందు ఆత్మహత్య అనుకున్నా కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో మర్డర్‌ కేసుగానే కేసు నమోదు చేసుకున్నారు.

ఈ నేపథ్యంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఏకే రావు జేబులో ఫిర్యాదు కాపీ దొరికింది. దీంతో ఆ లెటర్ ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఎఫ్ఎస్ఎల్ కు పోలీసులు ఆ లెటర్‌ను పంపించారు. అయితే నేడు పోలీసులకు ఏకే రావు పోస్ట్‌ మార్టం రిపోర్ట్‌ అందనుంది. ఈ నేపథ్యంలో ఆ పోస్టుమార్టం రిపోర్ట్‌ కీలకంగా మారనుంది. సిద్దగుంట పాళీ పీఎస్ లో నమోదైన 150 కోట్ల చీటింగ్ కేసు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. ఏకే రావును వేధించిన వ్యక్తులపై పోలీసుల ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కుటుంబ సభ్యుల స్టేట్మెంట్స్‌ను కూడా పోలీసులు రికార్డ్ చేశారు. దీనితో పాటు ఏకే రావు సెల్ ఫోన్స్ డేటాను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. అంతేకాకుండా పలువురు అనుమానితులను పోలీసులు విచారిస్తున్నారు.

Exit mobile version