NTV Telugu Site icon

Srirama Navami Wonder: శ్రీరామనవమి వేళ అద్భుతం.. ఆ ఇంట్లో వానరం సందడి

Maxresdefault (2)

Maxresdefault (2)

ఈ జగమంతా రామమయం.. శ్రీరాముడు ఎక్కడుంటే ఆయన పరమ భక్తుడు.. అంజనీ పుత్రుడు హనుమంతుడు అక్కడే ఉంటాడు. ఈమధ్యే రాములోరి కల్యాణంలో ఓ అద్భుతం జరిగింది, భక్తురాలికి ఆనందభాష్పాలు ఆగట్లేదు. జరిగింది ఏంటంటే ఓ ఇంట్లో శ్రీరాముడు కల్యాణం జరుగుతోంది. ఎక్కడి నుంచి వచ్చిందో ఓ వానరం.. ఆ ఇంట్లోకి ప్రవేశించింది.

రాములోరి కళ్యాణం ఒకవైపు జరుగుతుంటే.. ఓ అమ్మ ఒళ్ళోకి వచ్చి కూర్చుంది. అమ్మను కౌగిలించుకుంది. ఆ అమ్మ కూడా తన బిడ్డలాగే ఆ సాక్షాత్ హనుమంతుడిని ఆదరించింది.. అమ్మ ప్రేమను పంచింది. ఆ దృశ్యం కడు రమణీయంగా ఉంది. అమ్మ తనబిడ్డను వీపుమీద నిమిరినట్టుగా ఆ తల్లి ప్రేమను పంచింది. అంతే ఆ వానరం ఉబ్బితబ్బిబ్బయిపోయింది. ఆ తల్లి కంట కన్నీటి బిందువులు ఆనందభాష్పాలుగా కిందికి పడ్డాయి. యావత్ కుటుంబం ఆ కమనీయ, రమణీయ దృశ్యాలను చూసి పరవశించిపోయింది. ఆ రాముడి పెళ్ళి చూడడానికే నే వచ్చాను అన్నట్టుగా ఆ వానరం ఆ ఇల్లంతా కలియ తిరిగింది. ఈ వీడియో వైరల్ అవుతోంది. భక్తి టీవీలోని ఈ వీడియో మీరు కూడా చూసి తరించండి. రాముడి పెళ్ళికి హనుమంతుడు వచ్చాడంటూ అంతా ఆనందం వ్యక్తం చేశారు.

 

Show comments