కరోనా రక్కసి కొత్తకొత్తగా రూపాంతరాలు చెందిన ప్రజలపై విరుచుకుపడుతోంది. గత నెల దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ వేరియంట్ తక్కువ సమయంలో పలు దేశాల్లో వ్యాప్తి చెందిన దాని ప్రభావాన్ని చూపుతోంది. అయితే ఇప్పటికే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కునేందుకు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. అయితే తాజాగా డబుల్ మాస్క్ తప్పనిసరి అంటున్నారు వైద్య నిపుణులు. ఒమిక్రాన్ వేరియంట్ డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు వేగంగా వ్యాప్తి చెందుతున్న తరుణంలో ఎన్95 మాస్క్‌ను ధరించాలని సూచించారు. అయితే కొన్ని సార్లు ఎన్95 మాస్క్ ధరించడం వీలు లేకపోయినా.. అందుబాటులో లేకపోయి సర్జికల్ మాస్క్, సింగిల్ లేయర్ మాస్క్‌లు రెండు ధరించడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
రోగనిరోధక శక్తి లేని వ్యక్తులు సాధారణ సర్జికల్ మాస్క్‌తో ధరిస్తే 1000 మంది వ్యక్తులలో 10 మందికి ఇన్‌ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఉందని, అదే ఎన్95 మాస్క్‌లను ధరించినప్పుడు ఇన్‌ఫెక్షన్ రిస్క్ 1,000 మందిలో 1 ఉంటుందని సూచించిన అధ్యయనాలు ఉన్నాయని వైద్యులు అంటున్నారు. ఖరీదైన ఎన్95 మాస్క్‌లను కొనుగోలు చేయకుండా ఉండాలనుకునే వ్యక్తుల కోసం, ఉత్తమ ప్రత్యామ్నాయం డబుల్ లేయర్డ్, డబుల్ మాస్క్ ధరిస్తే ఎక్స్‌పోజర్‌ను నిరోధించడానికి కూడా సమర్థవంతమైన మార్గమని వెల్లడించారు.
