NTV Telugu Site icon

Army jawans dead: వాహనంలో మంటలు.. నలుగురు ఆర్మీ జవాన్లు సజీవ దహనం

Army Vehicle

Army Vehicle

జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్‌లో తమ వాహనం మంటల్లో చిక్కుకోవడంతో నలుగురు ఆర్మీ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన భాటా ధురియన్ ప్రాంతానికి సమీపంలో జరిగింది. పిడుగుపాటు కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి. పూంచ్‌కు 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఘటనాస్థలికి ఆర్మీ, పోలీసు సిబ్బంది చేరుకున్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.
Also Read: Karnataka Elections: కర్ణాటకలో ప్రచారానికి ప్రధాని మోదీ.. 20 చోట్ల భారీ బహిరంగ సభలు

గత ఏడాది డిసెంబరులో, రాజస్థాన్‌లోని ఉదయపూర్‌కు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇండియన్ ఆర్మీ ట్రక్కులో సాంకేతిక లోపం కారణంగా మంటలు చెలరేగాయి. ఉదయపూర్‌లోని మిలటరీ స్టేషన్‌కు వెళుతున్న ఐదు వాహనాల కాన్వాయ్‌లోని ట్రక్కులో మంటలు వచ్చాయి. అయితే, ఈ ఘటనలో సిబ్బంది, ప్రాణ నష్టం జరగలేదు. 2021లో రాజస్థాన్‌లోని గంగానగర్ జిల్లాలో ఆర్మీ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనం బోల్తా పడి మంటలు చెలరేగడంతో ముగ్గురు సైనికులు మరణించగా, మరో ఐదుగురు గాయపడ్డారు.