NTV Telugu Site icon

2021 బెస్ట్ యాప్‌లు ఇవే…

గూగుల్ ప్లేస్టోర్‌లో ప్ర‌తిరోజూ కొన్ని వంద‌ల కొత్త యాప్‌లు రిజిస్టర్ అవుతుంటాయి.  అందులో కొన్ని యాప్‌లు వినియోగించుకోవ‌డానికి, డైలీ లైఫ్ లో వాడుకోవ‌డానికి వీలుగా ఉంటాయి.  కొన్ని యాప్‌లు ఎంట‌ర్‌టైన్‌మెంట్ కోసం, కొన్ని యాప్‌లు స‌ర‌దాగా గేమ్‌లు వంటివి ఆడుకోవ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంటాయి.  ప్ర‌తీ ఏడాది గూగుల్ ప్లే స్టోర్ లో బెస్ట్ యాప్స్ ఏమున్నాయి అనే దానిపై స‌ర్వేను నిర్వ‌హిస్తుంది.  యూజ‌ర్ స‌ర్వే ఆధారంగా బెస్ట్ యాప్స్ ఏంటో ప్ర‌క‌టించి వాటికి అవార్డులు అంద‌జేస్తుంటుంది.  2021 యూజ‌ర్ ఛాయిస్ యాప్ అవార్డును ఏ యాప్ లు గెలుచుకున్నాయో ఇప్పుడు చూద్దాం.  

Read: అక్క‌డ బ‌య‌ట‌ప‌డుతున్న కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ కేసులే…

ఈ ఏడాది యూజ‌ర్ ఛాయిస్ బెస్ట్ యాప్‌గా క్ల‌బ్‌హౌస్ ఎంపికైంది.  ఇది ఆడియో సోష‌ల్ యాప్.  ఈ యాప్ లో ప‌రిచయం ఉన్న వ్య‌క్తుల‌తో మాత్ర‌మే కాకుండా, ప‌రిచ‌యం లేని వారికి కూడా రిక్వెస్ట్‌లు పంపి ఫ్రెండ్స్‌ను చేసుకోవ‌చ్చు.  వ‌న్‌టువ‌న్ చాట్‌, గ్రూప్ చాట్ వంటివి ఈ యాప్‌లో ఉన్నాయి.  ఆడియో సోష‌ల్ యాప్ కావ‌డంతో టైపింగ్ అవ‌స‌రం లేకుండా వాయిస్ ద్వారానే ఛాట్ చేసుకోవ‌చ్చు.  2021 వ సంవ‌త్స‌రానికిగాను బెస్ట్ యూజ‌ర్ చాయిస్ యాప్‌గా క్ల‌బ్‌హౌస్ ఎంపికైంది. అంతేకాదు, 2021 బెస్ట్ యూజ‌ర్ గేమ్ యాప్ కింద గ‌రేనా ఫ్రీ ఫైర్ మాక్స్ ఎంపికైంది.