బర్త్‌డే రోజే ప్రాణాలు కోల్పోయింది ఓ రెండేళ్ల చిన్నారి. ఈ హృదయవిదారక ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. ఆడుకుంటూ ఇంట్లో ఉన్న నీటి తొట్టిలో పడి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గ్రేటర్ నోయిడా పరిధిలోని దుజానా గ్రామానికి చెందిన సాక్షి(2) అనే చిన్నారి ఆడుకుంటూ ప్రమాదవశాత్తు నీళ్ల తొట్టిలో పడి ప్రాణాలు విడిచింది. అదే రోజు చిన్నారి జన్మదినం కావడం గమనార్హం. ఈ ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. బట్టలు ఉతకడానికి టబ్ నిండా నీళ్ళు ఉన్నాయి. చిన్నారి తన అన్నయ్యతో ఆడుకుంటుండగా నీళ్ల తొట్టిలో పడిపోయింది. ఈ క్రమంలో మృతి చెందింది.
Alsor Read:Budget Sessions: నేటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఈ నెల 17న రాష్ట్ర బడ్జెట్!
దుజానా గ్రామానికి చెందిన చంద్రపాల్‌కు ముగ్గురు పిల్లలు. అందులో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. మృతురాలు సాక్షియే చివరి సంతానం. మార్చి 12న చిన్నారి పుట్టిన రోజు. చిన్నారి ఇంట్లోనే ఉత్సాహంగా ఆడుకుంది. సాక్షి బర్త్ డే సందర్భంగా తండ్రి చంద్రపాల్ కేక్తేవడం కోసం బయటకు వెళ్లాడు. అమ్మ ఇల్లు శుభ్రం చేస్తోంది. దగ్గరలో బట్టలు ఉతకడానికి నీళ్లతో నిండిన ప్లాస్టిక్ టబ్ ఉంది. ఇంతలో బాలిక ఆడుకుంటూ టబ్ దగ్గరకు చేరుకుని అందులో పడిపోయింది. నీళ్లతో నిండిన టబ్‌లో పడిపోవడంతో చిన్నారి ఏడుపు వినిపించలేదు.
Alsor Read:Jansena: నేడు జనసేన ఆవిర్భావ సభ… ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న పవన్
దాదాపు గంట తర్వాత తల్లి గది నుంచి బయటకు వచ్చి చూడగా చిన్నారి టబ్‌లో పడిపోయింది. దీంతో వెంటనే చిన్నారిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, పరిస్థితి విషమంగా మారడంతో బాలిక మృతి చెందింది. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు సెంట్రల్ నోయిడా అదనపు డీసీపీ డాక్టర్ రాజీవ్ దీక్షిత్ తెలిపారు.