సౌతాఫ్రికాలో వెలుగు చూసినా కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్.. ప్రపంచాన్నిచుట్టేసే పనిలోపడిపోయింది.. ఇప్పటికే భారత్‌లో కూడా ఈ కొత్త వేరియంట్ కేసులు వెలుగుచూడగా.. తాజా, మరో రెండు కేసులు పాజిటివ్‌గా తేలాయి.. ఈ నెల 4వ తేదీన జింబాబ్వే నుంచి గుజరాత్‌లోని జామ్‌నగర్‌కు వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్ పాజిటివ్‌గా నిర్ధారించారు.. ఇక, అప్రమత్తమైన అధికారులు.. అతడు కలిసినవారిని ట్రేస్ చేశారు.. వారి నమూనాలు సేకరించి పరీక్షకు పంపారు. ఈ నేపథ్యంలో మరో ఇద్దరికి ఒమిక్రాన్ వేరియంట్ కరోనా సోకినట్టుగా ఇవాళ తేలింది. జింబాబ్వే నుంచి వచ్చిన వ్యక్తితోపాటు ఆయన భార్యకు, జామ్‌నగర్‌లోని అతడి బావకు కూడా ఒమిక్రాన్ పాజిటివ్‌గా తేలింది.. దీంతో గుజరాత్‌లో ఒమిక్రాన్ కేసుల సంఖ్య మూడుకు చేరుకుంది..
Read Also: ఎమ్మెల్సీ ఎన్నికలు.. పెద్దపల్లి పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
మరోవైపు భారత్‌లో ఇప్పటి వరకు నమోదైన ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల సంఖ్య 25కు పెరిగింది.. ఈ కొత్త వేరియంట్ కేసులు అత్యధికంగా మహారాష్ట్రలో 10, రాజస్థాన్‌లో 9, గుజరాత్‌లో 3, కర్ణాటకలో 2, ఢిల్లీలో ఒకటి చొప్పున నమోదయ్యాయి.. సౌతాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ ఇప్పటికే 57 దేశాలకు పాకింది.. పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నా… ఆ వేరియంట్ విస్తరన మాత్రం కొనసాగుతూనే ఉంది.
