NTV Telugu Site icon

ఘోర ప్రమాదం.. 18 మంది స్పాట్‌లోనే మృతి

Barabanki

Barabanki

అక్కడికక్కడే 18 మంది మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్‌లో జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో లక్నో – అయోధ్య హైవేపై మంగళవారం అర్ధరాత్రి డబుల్‌ డెక్కర్‌, బస్సును ట్రక్కు ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో.. స్పాట్‌లోనే 18 మంది మృతిచెందగా.. మరో 15 మందికి గాయాలు అయినట్టు తెలుస్తోంది.. పంజాబ్‌లోని లూధియానా నుంచి ప్రయాణికులతో ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు బీహార్‌ వెళ్తుంది.. అయితే.. బారాబంకి రామ్‌స్నెహిఘాట్ కొత్వాలి ప్రాంతంలోని జాతీయ రహదారిపై బస్సు నిలపివేశారు.. రాష్ట్ర రాజధాని లక్నోకు 28 కిలోమీటర్ల దూరంలో కార్మికులు, బస్సు ముందు రోడ్డుపై నిద్రిస్తున్నారు.. లక్నో వైపు నుంచి వస్తున్న ట్రక్కు వేగంగా వచ్చి బస్సును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది.. బస్సు, ట్రక్కు నిద్రిస్తున్నవారిపైకి దూసుకెళ్లడంతో.. భారీ ప్రాణనష్టం జరిగింది.

Show comments